హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్ లో బీసీ చేతివృత్తుల మేళా..బోనాల మట్టి కుండలు, పట్టుచీరలు.. 60 స్టాల్స్లో అన్నిరకాల ఉత్పత్తులు

హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్ లో బీసీ చేతివృత్తుల మేళా..బోనాల మట్టి కుండలు, పట్టుచీరలు.. 60 స్టాల్స్లో అన్నిరకాల ఉత్పత్తులు

హైదరాబాద్, వెలుగు: బీసీ చేతి వృత్తి కళాకారుల వస్తువుల ప్రదర్శన, అమ్మకాల మేళాను గురువారం నుంచి ఐమాక్స్  పక్కనున్న హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినట్లు బీసీ వెల్ఫేర్  ఇన్ చార్జి ప్రిన్సిపల్  సెక్రటరీ బాలమాయదేవి తెలిపారు. ఇందులో బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల చేతివృత్తుల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. మేళాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రారంభిస్తారని చెప్పారు. గత ఏడాది 30 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఈసారి 60 స్టాల్స్  ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదరి, చేనేత, పూసల తదితర సంప్రదాయ కులవృత్తులకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయిస్తారని చెప్పారు.