పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల వేళ.. మమతా బెనర్జీ వర్గం కొత్త పార్టీ సింబల్ ను ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరుతో పాటు కొత్త లోగోను 2026 సెప్టెంబర్ 21న ఆవిష్కరించారు. వచ్చ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త లోగోను పబ్లిసిటీ చేయాల్సిందిగా మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పార్టీ శ్రేణులకు సూచించింది.
పార్టీ సింబల్ లో మధ్యలో ఫుట్ బాల్ ప్లేయర్, దాని చూట్టూ మమతా బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో బ్లూ కలర్ బ్యాగ్రౌండ్ లో రూపొందించారు. వీటితో పాటు భారత జెండాను పోలిన కాశాయం,తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో సర్కిల్ రెండు వైపుల పొందు పరిచారు.
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో పాటు ఆ పార్టీ గుర్తులైన పూలు-గరుకతో చేసిన లోగోలను ఎకన్నికల కమిషన్ ఫ్రోజ్ చేసిన విషయం.
అక్టోబర్ 6న బెంగాల్ లో ఉపఎన్నికలున్నాయి. దీనికి సంబంధించి తాత్కాలికంగా రెండు వర్గాలకు కొత్త పేర్లతో పాటు గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. మమత వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ-ఫుట్ బాల్ ప్లేయర్ సింబల్ ఇచ్చింది. ఆరూప్ రాయ్ వర్తానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ అనే పేరుతో పాటు ఎన్వలోప్ కవర్ సింబల్ కేటాయించింది ఎన్నికల సంఘం.
