Video: ఏంది సామీ.. వాళ్లేమైనా కోడిపిల్లలు అనుకున్నావా .. ఐదు మంది చిన్నారులను బైక్పై ఎలా తీసుకెళ్లాడో చూడండి

Video: ఏంది సామీ.. వాళ్లేమైనా కోడిపిల్లలు అనుకున్నావా .. ఐదు మంది చిన్నారులను బైక్పై ఎలా తీసుకెళ్లాడో చూడండి

బైక్ పై ట్రిపుల్ రైడింగ్ అంటేనే పోలీసులు ఒప్పుకోరు. అలాంటి ఐదు మంది పిల్లలతో బైక్ నడిపిన వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐదు మందితో వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి.. కానీ ఇది వైరల్ కావడం వెనుక ఉన్న కారణం.. వెనుక సీటును ఇనుప బుట్టలా మార్చడమే. 

కర్ణాటలోని మైసూరు-నంజాగుడ్ రోడ్డుపై కనిపించిన బైక్  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. వెనుక సీటుపై కోళ్లను తీసుకెళ్తున్నట్లుగా.. ఇనుప చువ్వలతో చేసిన నాలుగు మూలల బుట్టలో పిల్లలను తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెనుక నలుగురు, ముందు ఒక పిల్లవాడు కలిపి మొత్తం ఐదు మందితో బైక్ నడిపాడు సదరు వ్యక్తి. మరోవిషయం ఏంటేంటే ఏ ఒక్క చిన్నారికి కూడా హెల్మెట్ లాంటి రక్షణ లేకపోవడం గమనార్హం. 

2026 సెప్టెంబర్ 20 (ఆదివారం) మైసూరు-నంజాగుడ్ రోడ్డుపై ఈ వీడియో కనిపించింది. టీవీఎస్ ఎక్సెల్ (XL) పై కూరగాయలను తీసుకెళ్తున్నట్లుగా.. కోడిపిల్లలను తీసకెళ్తున్నట్లుగా వెళ్లటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం కావడం, ఊటీ మెయిర్ కావడంతో భారీగా ట్రాఫిక్ ఉండటం ఆందోళన కలిగించే అంశం. 

పిల్లలను కోడిపిల్లల మాదిరిగా తీసుకెళ్లటంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఏమైనా ఆలోచించారా.. అసలు అతడికి ఏమైనా ఆలోచన ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీవీఎస్ ఎక్సెల్ పై ఒక డ్రైవర్, మరొక వ్యక్తి వెళ్లేందుకు పర్మిషన్ ఉందని.. కానీ ఇంతమందిని తీసుకెళ్లటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ట్రాఫిక్ రూల్స్ పై ఏమాత్రం బాధ్యత లేదని విమర్శిస్తున్నారు. అలాంటోళ్లను వెంటనే బొక్కలో వేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.