కొత్త వారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లివే..!

కొత్త వారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లివే..!

అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు అవకాశాలు మెరుగుపడటంతో గతవారం పెరిగిన బంగారం, వెండి రేట్లు దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లలో రేట్లు తిరిగి ఆల్ టైం గరిష్ఠాలకు చేరుతున్న వేళ షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైలర్లకు ఇదొక సరైన అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం ముఖ్యం. 

సెప్టెంబర్ 21న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.16 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 568గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 270గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 21, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 60వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది.