ఢిల్లీలో AICC చీఫ్ ఖర్గేతో మంత్రి వివేక్ భేటీ.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

ఢిల్లీలో AICC చీఫ్ ఖర్గేతో మంత్రి వివేక్ భేటీ.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

మంత్రివివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలి కాలంలో వైరల్ ఫీవర్ బారినపడి కోలుకున్న ఖర్గే ఆరోగ్య పరిస్థితిని ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ భేటీలో భాగంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను ఖర్గేకు వివరించారు  మంత్రి వివేక్.. . ముఖ్యంగా ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును ఏఐసీసీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే, రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ (22A) భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం గురించి ఖర్గేకు వివరించారు.

రాజకీయ అంశాలతో పాటు, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం.. దానివల్ల భవిష్యత్తులో వ్యవసాయం, తాగునీటి రంగాలపై ఎదురయ్యే పరిస్థితుల గురించీ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయ, పరిపాలనా అంశాలన్నింటినీ మంత్రి వివేక్ ఏఐసీసీ అధ్యక్షుడికి వివరించారు.