తెలంగాణలో ఎన్నికలు జరగని 58 గ్రామ పంచాయితీలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగని గ్రామ పంచాయితీలకు అండగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు జరగలేదన్న కారణంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయిన క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఎన్నికలు జరగని 58 గ్రామ పంచాయితీలకు రాష్ట్ర నిధులు విడుదల చేశారు.
గ్రామ పంచాయితీలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 58 గ్రామపంచాయతీలకు రూ.33.62 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.ఈమేరకు ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం.
ఎన్నికలు జరగలేదని గ్రామాల అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. కేంద్ర నిధులు రాకపోయినా.. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నిధులను ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, మరియు ఇతర అత్యవసర సమగ్ర అభివృద్ధి పనుల కోసం వినియోగించనున్నారు.ఎన్నికలు జరగకపోయినా గ్రామాల ప్రగతి కుంటుపడకూడదనే ఉద్దేశంతో మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ నిధులు విడుదల చేయించడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
