అల్వాల్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో ఎఫ్డీఆర్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ సేతు సైన్స్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రారంభించారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్డీఆర్) అల్వాల్ జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో సైన్స్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇలాంటి సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైతే విద్యాప్రమాణాలు ఫీజుల భారం లేకుండా మరింత మెరుగుపడతాయన్నారు.
జేపీ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్‌లో ఎదగడానికి అనేక మార్గాలున్నాయని, కానీ వారిలోని మేధస్సు వికసిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. దాతలు గ్రామాలు, మండల కేంద్రాల్లో, చిన్న పట్టణాలలో ఇలాంటి సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. వివరాల కోసం ఎఫ్డీఆర్ ఆఫీస్ నంబర్ 98660 74025కు కాల్ చేయవచ్చన్నారు.
