Ayyagare No.1: ‘అయ్యగారే నెం.1’ ఫ్యాన్‌ను కలిసిన అఖిల్.. హార్ట్ టచింగ్గా నాగరాజు ఎమోషనల్ జర్నీ

Ayyagare No.1: ‘అయ్యగారే నెం.1’ ఫ్యాన్‌ను కలిసిన అఖిల్.. హార్ట్ టచింగ్గా నాగరాజు ఎమోషనల్ జర్నీ

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మొత్తానికి హిట్ కొట్టేశాడు. ‘లెనిన్’ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఇంకా చెప్పాలంటే అక్కినేని అభిమానులు కాలర్ ఎత్తుకునేలా చేశాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన ఈ విజయం అఖిల్ కెరీర్‌కు ఎంత కీలకమో, అభిమానులకు కూడా అంతే ప్రత్యేకం. ప్రస్తుతం ‘లెనిన్’ థియేటర్లలో సక్సెస్ ఫుల్గా రన్ అవుతూ వందకోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ విజయంతో అఖిల్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘‘అయ్యగారే నెం.1’’అనే డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ వీరాభిమాని నాగరాజుకు ఈ సక్సెస్ మరింత ఆనందాన్ని ఇచ్చింది.

‘అయ్యగారే నెం.1’ఫ్యాన్‌ను కలసిన అఖిల్..

‘లెనిన్’ రిలీజ్ టైంలో ‘అయ్యగారే నెం.1’ అంటూ వైరల్ అయిన గుంటూరుకు చెందిన పండ్ల వ్యాపారి నాగరాజు, ఎట్టకేలకు హీరో అఖిల్ అక్కినేనిని కలిశారు. నాగరాజు తనపై చూపిన నిస్వార్థమైన అభిమానానికి చలించిన అఖిల్, స్వయంగా ఆయనను కలవాలని కోరుకున్నారు. తాజాగా జరిగిన వీరి ఎమోషనల్ మీట్‌కు సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా అభిమానిని ఎంతో ఆప్యాయంగా పలకరించిన అఖిల్, అతనితో కాసేపు ముచ్చటిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజులిచ్చారు. నాగరాజు కల్మషం లేని అభిమానం, చలించే పోయిన అఖిల్ ఆదరణ అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దానికితోడు నాగరాజు-అఖిల్ కలిసిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన హార్ట్ టచింగ్ క్యాప్షన్‌.. వీరి మధ్య నెలకొన్న బంధాన్ని మరింత ఎలివేట్ చేసింది. 

 ‘‘చివరికి తన అభిమాన ‘అయ్యగారు ’ను కలిశాడు. ప్రతి సంబరానికి తగిన అద్భుతమైన క్షణం.. చాలా కాలం గుర్తుండిపోయే జ్ఞాపకం’’ అంటూ నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ‘ఎట్టకేలకు అయ్యగారిని కలిశాడు’, ‘ఇది నిజమైన అభిమానానికి దక్కిన గుర్తింపు’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

నాగరాజు ఎమోషనల్ జర్నీ..

‘లెనిన్’ సినిమా విడుదల సమయంలో ‘అయ్యగారే నెం.1’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన పండ్ల వ్యాపారి నాగరాజు, హీరో అఖిల్ అక్కినేనిపై తనకున్న అభిమానాన్ని హృదయపూర్వకంగా వ్యక్తం చేసిన ఓ ఇంటర్వ్యూ లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తూ, కరెంట్ బిల్లు చెల్లించడానికే కష్టపడుతున్న పరిస్థితుల్లోనూ, మాట్లాడలేని తన భార్యను చూసుకుంటూనే నాగరాజు అఖిల్‌పై ఉన్న అభిమానాన్ని ఏమాత్రం తగ్గనివ్వలేదు. ‘అయ్యగారే నెం.1’ అంటూ ఆయన వ్యక్తం చేసిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

నాగరాజు పరిస్థితి, ఆయన నిస్వార్థమైన అభిమానం గురించి తెలుసుకున్న అఖిల్ అక్కినేని కూడా భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఇంతటి ప్రేమ చూపించిన అభిమానిని స్వయంగా కలవాలని నిర్ణయించుకున్న అఖిల్, తాజాగా నాగరాజుతో భేటీ అవ్వడంతో ఈ ఇద్దరి కలయిక ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ అఖిల్ చూపిన ఆదరణతో మరో మెట్టు ఎక్కేశాడు.