కన్నౌజ్: ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్, మాస్టార్ రొమాన్స్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు.. ఈ రొమాంటిక్ మాస్టర్ భార్య సీక్రెట్గా తరగతి గదిలో ఉంచిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Breaking News: Kannauj, Uttar Pradesh
— Ms. Avnni (@Avnni61) July 15, 2026
A video allegedly from a composite government school in Saurikh Block has gone viral, triggering controversy. The clip appears to show a male assistant teacher and a female assistant teacher kissing on the school premises.
Following the… pic.twitter.com/iisk0y3KqK
విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉండి కామోద్రేకం మైకంలో మతి తప్పి ప్రవర్తించిన ఈ టీచర్లను.. దుష్ప్రవర్తన, వృత్తికి భంగం కలిగించారనే కారణాలతో సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ కాంపోజిట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సౌరిఖ్ బ్లాక్‌లోని బజేడి గ్రామంలోని ఒకే ప్రభుత్వ పాఠశాలలో ఒక సహాయ ఉపాధ్యాయుడు, ఒక మహిళా సహాయ ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. ఈ ఘటన వాస్తవానికి జనవరిలోనే జరిగింది. అయితే.. బాధితుడి భార్య ఇటీవల ఈ వీడియోను అప్ లోడ్ చేసింది.
🚨 Kannauj, UP: A video allegedly showing two teachers in a compromising situation inside a government school classroom has gone viral. pic.twitter.com/Qki0cFzseq
— Mohalle Ka Scene (@mohallekascene) July 15, 2026
భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మాస్టారు భార్య అతనిపై నిఘా పెట్టింది. స్కూల్లో తన భర్త ఒక టీచరమ్మతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో కన్ఫర్మ్ చేసుకోవడానికి క్లాస్ రూంలో సీక్రెట్ కెమెరాను అమర్చింది. స్కూల్లో బ్రేక్ సమయంలో ఆ ఇద్దరు టీచర్లు ముద్దు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకోవడంతో భార్య అనుమానం నిజమైంది.
►ALSO READ | అమెరికాలో దారుణం: నువ్వు ముస్లిమా..? అని అడిగి.. ఇండియన్ ని కత్తితో 15 సార్లు పొడిచి చంపాడు...
ఈ వీడియోలు బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ ఇద్దరు టీచర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 13న ఈ విషయంపై విద్యా శాఖ అధికారులు దర్యాప్తు చేశారు. ఇద్దరూ తప్పు చేసినట్లు తేలడంతో విద్యా శాఖ ఈ టీచరమ్మను, మాస్టారును సస్పెండ్ చేసింది.
