నిర్మల్: నిర్మల్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నిర్మల్ పట్టణంలోని నడిబొడ్డున S.V అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దొంగలు పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. బైక్పై వచ్చి మొదటి అంతస్తులోకి దొంగలు దర్జాగా ప్రవేశించారు.
101 ఫ్లాట్ తాళం పగలగొట్టి దొంగలు వెండి సామాను చోరీ చేశారు. 201 ఫ్లాట్ తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. అలికిడి కావడంతో దొంగలు వెనుదిరిగారు. వీడియో CC కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | జర్నలిస్టుల సమస్యలపై TWJF ఛలో సమాచార్ భవన్.... ఐ అండ్ పీఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా..
