ప్రభుత్వ స్కూళ్లలో చదివితే సీఎం అవ్వచ్చు.. నేనే ఉదాహరణ: సీఎం రేవంత్ రెడ్డి 

ప్రభుత్వ స్కూళ్లలో చదివితే సీఎం అవ్వచ్చు.. నేనే ఉదాహరణ: సీఎం రేవంత్ రెడ్డి 

వనపర్తి జిల్లా దేవకద్రలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ను ప్రారంభించారు సీఎం రేవంత్. బుధవారం ( జులై 15 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే ముఖ్యమంత్రి అవ్వచ్చని... అందుకు తానే ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ స్కూళ్ళు కీలక పాత్ర పోషించాయని... చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు సీఎం రేవంత్.

చదువుల్లో రాణించకపోతే.. క్రీడల్లో రాణించాలని.. మనకు మహమ్మద్ సిరాజ్, నిఖిత్ జరీన్ లు స్ఫూర్తి అని అన్నారు. నిఖిత్ జరీన్ కు గ్రూప్ 1 డీఎస్పీగా జాబ్ ఇప్పించామని... మొన్న గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ కు రూ.3 కోట్లు ఇచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని అన్నారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లలో 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని..ప్రైవేట్ లో 11 వేల స్కూళ్ళు ఉంటే...33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు సీఎం రేవంత్.

ప్రభుత్వ స్కూళ్ల టీచర్ల అర్హతతో సగం కూడా ప్రైవేట్ టీచర్లకు లేదని.. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు లేక జనం ప్రైవేట్ బాట పడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళు పునరుద్ధరిస్తున్నామని...ప్రభుత్వ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు సీఎం రేవంత్.