తెలంగాణ బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలి..కిషన్రెడ్డికి కార్మిక సంఘాల వినతి

తెలంగాణ బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలి..కిషన్రెడ్డికి కార్మిక సంఘాల వినతి

 

  •     12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి

గోదావరిఖని/ కోల్​బెల్ట్/నస్పూర్,వెలుగు: తెలంగాణలోని బొగ్గు బ్లాక్​లన్నీ సింగరేణికే కేటాయించాలని, 4 లేబర్​ కోడ్​లతో సంబంధం లేకుండా కార్మికుల వేతన ఒప్పందానికి 12వ వేజ్​బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కోరారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి వచ్చిన కేంద్రమంత్రికి వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. తాడిచర్ల బ్లాక్- 2ను సింగరేణికి కేటాయించినందుకు ఏఐటీయూసీ లీడర్లు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

సింగరేణి ప్రయోజనాల పరిరక్షణకు, సంస్థాగత బలోపేతం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతూ 9 కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని టీబీజీకేఎస్ లీడర్లు అందజేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సీఐటీయూ నాయకులు విన్నవించారు.  మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కిషన్​రెడ్డిని వివిధ సింగరేణి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కలిసి పలు వినతులను అందించారు.