ప్రాణం తీసిన భయం.. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య

ప్రాణం తీసిన భయం..  పరీక్షల్లో ఫెయిల్ అవుతానని ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: పరీక్షల్లో ఫెయిల్​ అవుతాననే భయంతో ఓ ఇంజనీరింగ్​ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్​బషీరాబాద్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్ర, గోదావరి హోమ్స్​కు చెందిన రాహుల్​ మాదాపూర్​లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్  ఫైనల్​ ఇయర్​ చదువుతున్నాడు. కాగా, గత సెమిస్టర్​లో రెండు సబ్జెక్టులు​ఫెయిల్​ అవుతానని ఇంట్లో వారికి చెబుతూ అందోళన చెందేవాడు.సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.