కేరళలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంఘ విద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి..ఆ తర్వాత ప్రజల తీర్పులు కౌన్సిలర్ ఎన్నికై.. జైలులో ప్రమాణ స్వీకారం చేసిన ఘటన కేరళలోని తిరువనంతపురం జైలులో జరిగింది.వివరాల్లోకి వెళితే..
కేరళ సంఘ విద్రోహ (నివారణ) చట్టం (KAAPA) కింద అరెస్టయిన తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ కౌన్సిలర్, జైలులోనే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. విధానపరమైన లోపాలతో ప్రజల తీర్పును ఓడించలేమని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. వియ్యూర్ సెంట్రల్ జైలులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
తిరువనంతపురం మేయర్ వి.వి. రాజేష్..జైలులో కౌన్సిలర్ సుగతన్ ఆర్ జైలులోనే ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
తిరువనంతపురం కార్పొరేషన్‌లోని వాళొట్టుకోణం వార్డు నుంచి ఎన్నికయ్యారు సుగతన్.. ఇది అతని ఎన్నికపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి.వి. కుంజికృష్ణన్ అతని ఎన్నికల సరైనదే అని తీర్పు ఇవ్వడంతో సుగతన్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
కోర్టు ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం పూర్తి చేయడానికి మేయర్ వి.వి. రాజేష్ ,కార్పొరేషన్ అధికారులను వియ్యూర్ సెంట్రల్ జైలులోకి అనుమతించారు. ఈ చారిత్రాత్మక ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని మీడియా సిబ్బందిని కూడా జైలు లోపలికి అనుమతించారు.
