ఇలాంటోళ్లను నడి రోడ్డుపై ఏం చేయాలో మీరే చెప్పండి.. : రాడ్లు, రాళ్లతో బైక్ పై వెంటాడి చంపే ప్రయత్నమా..!

ఇలాంటోళ్లను నడి రోడ్డుపై ఏం చేయాలో మీరే చెప్పండి.. : రాడ్లు, రాళ్లతో బైక్ పై వెంటాడి చంపే ప్రయత్నమా..!

వీళ్లు మనుషులా రాక్షసులా.. ఇలాంటోళ్లను ఏం చేయాలి అంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ ఒకే ఒక్క మాట అంటున్నారు.. ఇలాంటోళ్లను నడి రోడ్డుపై కాల్చిపారేయాలి.. ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నారా.. పట్టపగలు.. నడి రోడ్డుపై.. 15 కిలోమీటర్ల వరకు వీళ్లు చేసిన హైరానా.. హంగామా.. దుర్మార్గమైన పనులు తెలిస్తే.. మీరు కూడా ఇలాగే అంటారు.. ఇంతకీ ఈ ఇద్దరు చేసిన పని ఏంటో తెలుసుకుందామా..

మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ జిల్లాలోని భావ్లీ అనే ఏరియా. ఇక్కడ ఇగత్ పురి అనే జలపాతం ఉంటుంది. ఇది టూరిస్ట్ స్పాట్. ఇటీవల భారీ వర్షాలు పడటంతో నీళ్లు బాగా రావటంతో.. పూనమ్ భగవత్ తన భర్త, ఇతర కుటుంబ సభ్యులతో వీకెండ్ పర్యటనలో భాగంగా 2026, జూలై 12వ తేదీ భావ్లీ ఏరియాకు వెళ్లింది. 

అక్కడికి వెళ్లిన తర్వాత స్థానికంగా ఉన్న కొంత ఆకతాయిలు ఈలలు వేయటం.. అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఈ విషయంపై పూనమ్ భగవత్ ఫ్యామిలీతో ఆ కుర్రోళ్లకు గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిన ఆ కుర్రోళ్లు.. మరికొంత మందిని తీసుకుని వచ్చారు. మళ్లీ వేధించటం మొదలుపెట్టారు. ఈ సమయంలో పూనమ్ భగవాన్ భర్తను కొట్టాడు. గొడవ పెరుగుతుండటంతో.. అక్కడి నుంచి తమ కారులో వెనక్కి వచ్చేశారు పూనమ్ ఫ్యామిలీ. 

ఈ కుర్రోళ్లు మాత్రం వదల్లేదు.. రాడ్లు, కర్రలతో బైక్ పై వెంటపడ్డారు. బైక్ పై వెంబడిస్తూ కారుపై రాళ్లు విసిరారు. ఓ బైక్, కారుతో వెంబడిస్తూ.. బీభత్సం చేశారు. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 15 కిలోమీటర్లు బైక్ పై వెంటాడుతూ.. రోడ్డుపై బీభత్సం చేశారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారులోకి రాళ్లు విసిరారు. కారు ముందు భాగాన్ని ఇనుప రాడ్లతో పగలగొట్టారు. కారు చుట్టూ ఉన్న అన్ని అద్దాలను రాళ్లు, రాడ్లతో పగలగొట్టి.. బీభత్సం చేశారు. కారు ఆపండీ లేకపోతే చంపేస్తాం అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ బీభత్సం చేశారు. 

ఈ ఘటన అంతా కారులోని పూనమ్ బంధువులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంత బరితెగిస్తున్న ఇలాంటోళ్లను ఎలా వదిలేస్తారు అంటూ పోలీసులను ఏకిపారేశారు నెటిజన్లు. రంగంలోకి దిగిన నాసిక్ పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీళ్లంతా ఇగత్ పురి, నందగావ్ సాడో, మాణిక్ ఖంబ్ ప్రాంతాలకు చెందినోళ్లని.. వీళ్లిందరినీ అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. 

ఈ వీడియోపై నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ పర్యాటక ప్రాంతంలో.. ఓ కుటుంబంపై దాడి చేయటమే కాకుండా.. 15 కిలోమీటర్లు వెంటాడటం అనేది.. వాళ్లల్లో ఉన్న క్రూరత్వానికి పరాకాష్ట అని.. ఇలాంటోళ్లను నడి రోడ్డుపై కాల్చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఫ్యామిలీని లైంగికంగా వేధించటమే కాకుండా.. ప్రశ్నించి..  ఎదురుతిరిగిన ఆ కుటుంబాన్ని చంపటానికి ప్రయత్నిస్తారా.. కారుపై విసిరిన రాడ్లు నేరుగా వాళ్లకు తగిలి ఉంటే పరిస్థితి ఏంటీ.. బాధితులు గాయాలతో బయటపడ్డారు కానీ.. ప్రాణాలు పోయిఉంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.