పచ్చిమిర్చి తరిగేటప్పుడు చేతులు మండుతున్నాయా? ఈ చిట్కాలు తెలిస్తే మీ పని మరింత ఈజీ

పచ్చిమిర్చి తరిగేటప్పుడు చేతులు మండుతున్నాయా?  ఈ చిట్కాలు తెలిస్తే మీ పని మరింత ఈజీ

వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు తెలిస్తే చాలు.. వంట చేయడం సులువవడమే కాదు, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. రోజూ కిచెన్‌లో ఎదురయ్యే కొన్ని చిన్న సమస్యలతో ఇరుక్కోకుండా, స్మార్ట్‌గా పనులు పూర్తి చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలు ఉన్నాయి.... 

ఈ సింపుల్ కిచెన్ హ్యాక్స్ మీ రోజు వంట గది పనులను మరింత తేలికగా మారుస్తాయి. అవేంటో ఓసారి చూసేయండి:

బిస్కెట్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే: స్టీల్ బాక్స్ అడుగున కొంచెం చక్కెర వేసి, ఆ పైన బిస్కెట్స్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి మెత్తబడకుండా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి.

కొబ్బరిచిప్ప సులువుగా ఊడొచ్చేందుకు: కొబ్బరిచిప్పను స్టవ్ పై మూడు నిమిషాలు వేడిచేసి చల్లార్చాలి. తర్వాత పై నుంచి చిప్పను చేత్తో కొడితే కొబ్బరి ముక్క తేలికగా ఊడొస్తుంది.

మెత్తటి పరాటాల కోసం: పరాటాలు దూది లాగా మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు నీళ్లతో పాటు కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి.

పచ్చిమిర్చి గింజలు చేతికి అంటకుండా: పచ్చిమిర్చి తరిగే ముందు చేతులకి కొంచెం ఆవనూనె లేదా కొబ్బరి నూనె రాసుకుంటే, గింజలు చేతికి అంటుకోవు ఇంకా చేతులు మంట పుట్టకుండా ఉంటాయి.