ఇద్దరమ్మాయిల నిండు ప్రాణాలు.. మంచిర్యాల జిల్లాలో విషాద ఛాయలు

ఇద్దరమ్మాయిల నిండు ప్రాణాలు.. మంచిర్యాల జిల్లాలో విషాద ఛాయలు

మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన గోశిక మాధవి సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. టేకుమట్లకు చెందిన వెంకటేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై జైపూర్ ఎస్సై భూమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మంచిర్యాలలో ఆందోళన చేపట్టారు.

ప్రేమించిన వాడు దూరమయ్యాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన అర్చన(21) కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతను నెల రోజుల కింద ఆత్మహత్య చేసుకోగా, అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్న ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తూ వచ్చారు. శనివారం తండ్రి ఆటో నడపడానికి వెళ్లగా, తల్లి, సోదరుడు గుడికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చీరతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

►ALSO READ | షాబాద్‌ ఘటన: అందుకే వాళ్లను చంపేశా.. ఆరు హత్యలకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో !