రీజనల్ రింగ్ రోడ్డుపై అఖిల పక్ష సమావేశంలో సీఎం కీలక ప్రకటన

రీజనల్ రింగ్ రోడ్డుపై అఖిల పక్ష సమావేశంలో  సీఎం కీలక ప్రకటన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించగలమని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం (జులై 13) ఎంపీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. 

హైదరాబాద్ కు IIM ను తీసుకురావాలని అందుకు  బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని కోరారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం, 
మెట్రో విస్తరణకు సంబంధించి రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని చెప్పారు.

RRR భూసేకరణ ఒక కొలిక్కి వచ్చింది.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని RRR ను పూర్తి చేసుకోవాలని అన్నారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం అనుమతులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. సాగునీటికి సంబంధించి తుంగభద్ర గేట్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఆర్ పాటిల్ తో చర్చించాం..  
ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నుంచి NOC ఇవ్వాల్సి ఉంది.. డిండి-30 టీఎంసీలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు-90 టీఎంసీలకు NOC ఇవ్వాల్సి ఉంది.. NOC అంశం చర్చల దశలో ఉందని..  ఈ విషయంలో కేంద్రం కూడా చొరవ చూపాలి అన్నారు. 
 
120 టీఎంసీలకు కేంద్రం అనుమతులు వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందన్నారు. కేంద్రం సహకరిస్తే సహకరించిందని నిరభ్యంతరంగా చెబుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఒప్పుకునేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. తుమ్మిడిహట్టి, పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్ట్స్ కు సంబంధించిన అనుమతులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా చూడాలన్నారు.