ఫిఫా వరల్డ్ కప్ 2026: సెమీస్‌కు చేరిన టాప్-4 జట్లు..

ఫిఫా వరల్డ్ కప్ 2026: సెమీస్‌కు చేరిన టాప్-4 జట్లు..
  •     జూలై 15, 16 తేదీల్లో కీలక పోరు
  •     క్వార్టర్​ ఫైనల్​లో నార్వేను ఓడించిన ఇంగ్లండ్​, స్విట్జర్లాండ్​పై అర్జెంటీనా ఘన విజయం 
  • కిందటిసారి ఫైనల్లో ఓటమి పాలై ఈసారి ఎలాగైనా టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఫ్రాన్స్‌‌‌‌ .. 
  • వరుసగా రెండోసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో మెస్సీ సేనలు.. 
  • 1966 తర్వాత మరోసారి ఫైనల్‌‌‌‌కు అడుగు దూరంలో ఇంగ్లండ్‌‌‌‌.. 
  • ఇక ఆరంభం నుంచే దూకుడైన ఆటతో ఆకట్టుకుంటూ 
  •  కప్పు గెలవాలనే సంకల్పంతో బరిలో ఉన్న స్పెయిన్​.. 

హైదరాబాద్, వెలుగు : ఫిఫా ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌‌‌ 2026లో టైటిల్‌‌‌‌ సమరానికి మరో అడుగు మాత్రమే మిగిలింది. శనివారం జరిగిన చివరి రెండు మ్యాచ్​లతో క్వార్టర్‌‌‌‌ఫైనల్స్‌‌‌‌ ముగిసాయి. సెమీఫైనల్‌‌‌‌ బెర్త్‌‌‌‌లను ఫ్రాన్స్‌‌‌‌, స్పెయిన్‌‌‌‌, అర్జెంటీనా, ఇంగ్లండ్‌‌‌‌ దక్కించుకున్నాయి. ఫిఫా ర్యాంకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌-4లో ఉన్న జట్లు ఒకేసారి   సెమీస్‌‌‌‌కు చేరడం ఫుట్​బాల్​ చరిత్రలో ఇదే తొలిసారి. మొదటి సెమీఫైనల్‌‌‌‌లో జూలై 15న ఫ్రాన్స్‌‌‌‌, స్పెయిన్‌‌‌‌ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్‌‌‌‌లో జూలై 16న డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అర్జెంటీనా, 1966 తర్వాత మరోసారి టైటిల్‌‌‌‌పై కన్నేసిన ఇంగ్లండ్‌‌‌‌  పోటీ పడనున్నాయి.  

అల్వారెజ్‌‌‌‌ అదరగొట్టి.. సెమీస్‌‌‌‌లోకి 

అర్జెంటీనా మరోసారి ఒత్తిడిని తట్టుకుని ఫిఫా  సెమీఫైనల్‌‌‌‌కు చేరుకుంది. శనివారం ఉదయం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌లో స్విట్జర్లాండ్‌‌‌‌ను అదనపు సమయంలో 3-–1తో ఓడించింది.  జూలియన్‌‌‌‌ అల్వారెజ్‌‌‌‌, మార్టినెజ్‌‌‌‌ అదనపు సమయంలో చేసిన గోల్స్‌‌‌‌ అర్జెంటీనాకు ఈ విజయాన్ని అందించాయి. మ్యాచ్‌‌‌‌ ఆరంభంలోనే లియోనెల్‌‌‌‌ మెస్సీ ఇచ్చిన కార్నర్‌‌‌‌ను అలెక్సిస్‌‌‌‌ మాక్‌‌‌‌ అలిస్టర్‌‌‌‌ గోల్‌‌‌‌గా మలిచి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. సెంకండ్​ హాఫ్​ 67వ నిమిషంలో డాన్‌‌‌‌ ఎండోయే గోల్‌‌‌‌తో స్విట్జర్లాండ్‌‌‌‌ ఇక్వాల్​ చేసింది. అయితే కొద్ది సేపటికే బ్రిల్‌‌‌‌ ఎంబోలోకు రెడ్‌‌‌‌కార్డు పడటంతో స్విస్‌‌‌‌ జట్టు 10 మందితోనే ఆటను కొనసాగించాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో స్కోరు 1–-1తో  ముగియడంతో  ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌కు వెళ్లింది. 112వ నిమిషంలో జూలియన్‌‌‌‌ అల్వారెజ్‌‌‌‌ దూరం నుంచి అద్భుత గోల్‌‌‌‌ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లౌటారో మార్టినెజ్‌‌‌‌ మరో గోల్‌‌‌‌ చేయడంతో అర్జెంటీనా 3–-1తో విజయం ఖాయం చేసుకుంది. 

బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌ డబుల్‌‌‌‌ ధమాకా.. 

జూడ్‌‌‌‌ బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌   ఆటతో ఇంగ్లండ్‌‌‌‌  సెమీఫైనల్‌‌‌‌కు చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌లో నార్వేపై 2–-1తో అదనపు సమయంలో విజయం సాధించింది. దీంతో 2018 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌‌‌‌ చివరి నాలుగు జట్లలో చోటు దక్కించుకుంది. 36వ నిమిషంలో ఆండ్రియాస్‌‌‌‌ షెల్డెరప్‌‌‌‌ గోల్‌‌‌‌తో నార్వే ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే  ఫస్ట్​ హాఫ్​  ముగిసేలోపు బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌  గోల్‌‌‌‌ సాధించాడు. నిర్ణీత సమయంలో స్కోరు 1-–1తో  ముగిసింది.  ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌  మూడో నిమిషంలో బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌ మరో గోల్‌‌‌‌ చేసి ఇంగ్లండ్‌‌‌‌కు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌కు ఇది ఆరో గోల్‌‌‌‌.  కెప్టెన్‌‌‌‌ హ్యారీ కేన్‌‌‌‌తో కలిసి జట్టు తరఫున అత్యధిక గోల్స్‌‌‌‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫ్రాన్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ కిలియన్‌‌‌‌ ఎంబాప్పే, అర్జెంటీనా కెప్టెన్‌‌‌‌ లియోనెల్‌‌‌‌ మెస్సీ కంటే రెండు గోల్స్‌‌‌‌ వెనుక ఉన్నాడు.  సెమీఫైనల్లో ఇంగ్లండ్‌‌‌‌ అర్జెంటీనా తో తలపడనుంది. 1966 తర్వాత మరోసారి ప్రపంచకప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు చేరాలన్న ఇంగ్లండ్‌‌‌‌ ఆశలకు ఇప్పుడు ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది.

ఆ నలుగురిపై అంతా ఆసక్తి.. 

సెమీస్‌‌‌‌లో స్టార్‌‌‌‌ ఆటగాళ్ల మధ్య పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అర్జెంటీనా నుంచి లియోనెల్‌‌‌‌ మెస్సీ, ఫ్రాన్స్‌‌‌‌ తరఫున కిలియన్‌‌‌‌ ఎంబాప్పే, స్పెయిన్‌‌‌‌ నుంచి లామిన్‌‌‌‌ యమాల్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌ నుంచి జూడ్‌‌‌‌ బెల్లింగ్‌‌‌‌హామ్‌‌‌‌, హ్యారీ కేన్‌‌‌‌ వంటి దిగ్గజాలు బరిలోకి దిగనున్నారు. ఈ నాలుగు జట్లలో ఎవరు ఫైనల్‌‌‌‌కు చేరి ప్రపంచకప్‌‌‌‌ ట్రోఫీ కోసం పోరాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టి ఇప్పుడు 
ఈ రెండు సెమీఫైనల్‌‌‌‌ పోరులపైనే నిలిచింది.