టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.4.41 కోట్ల భారీ విరాళం

టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.4.41 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన రిటైల్ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ భారీ విరాళం ఇచ్చింది. సోమవారం (జులై  13) టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.4.41 కోట్లు విరాళంగా అందించింది.

 ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు టీటీడీ బోర్డు సభ్యులకు విరాళాలు అందజేశారు.  

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి లకు విరాళం డీడీలను అందజేశారు.

►ALSO READ | తిరుమలపై రాజకీయాలు చేయొద్దు : కర్నాటక సీఎం డీకేపై ఆగ్రహం