శేఖర్ మాస్టర్ తో గొడవే లేదు.. చిరంజీవితో కలిసి లంచ్ చేసామంటూ జానీ మాస్టర్ క్లారిటీ!

శేఖర్ మాస్టర్ తో గొడవే లేదు.. చిరంజీవితో కలిసి లంచ్ చేసామంటూ జానీ మాస్టర్ క్లారిటీ!

టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ మధ్య నిన్న ( జూలై 12, 2026 ) వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కొరియోగాపర్లు.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన వంటి అంశాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో  పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి కూల్ చేశారు. యూనియన్ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ వివాదంపై లేటెస్ట్ గా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి, జానీ మాస్టర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు.

శేఖర్ మాస్టర్ తో తమకు ఎలాంటి గొడవలు లేవని .. తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌ అన్నారు. మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి యుద్ధాలు లేదు. చిన్న చిన్న అభిప్రాయభేదాలు  మాత్రమే .. ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి.  నిన్న ( జూలై 12, 2026)  మా యూనియన్ సమస్యలపై డిష్కషన్స్ జరిగింది. మేమందరం సోదరులం. అందరూ మంచి వ్యక్తులమే.. యూనియన్ కోసమే అందరూ వర్క్ చేస్తామన్నారు.  

డ్యాన్స్ మాస్టర్ల మధ్య గొడవలు అంటూ వస్తున్న  వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి అడిగారని జానీ తెలిపారు. ఈ రోజు ( జూలై 13, 2026 ) చిరంజీవితో కలిసి నేను శేఖర్ మాస్టర్ భోజనం కూడా చేశాం. సినిమాలు, పాటలు, డ్యాన్స్ స్టెప్ లు గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం..  ఆల్ మాస్టర్స్ కు ఆల్ హీరోస్ సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారే మా అందరికీ స్పూర్తి అని జానీ మాస్టర్ అన్నారు.. సినీ ఇండస్ట్రీలో డ్యాన్సర్లకు మంచి గుర్తింపు, స్థానం ఉందంటే అందుకు కారణం చిరంజీవిగారే అని కొనియాడారు.

 

మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ నెలకొన్న పరిణామాలపై అధ్యక్షురాలు సుమలతా దేవి వివరణ ఇచ్చారు. డాన్సర్స్ అసోషొయేషన్ కు 35 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని నడింపించటం ఈజీ కాదు. ఏది జరిగినా ప్రెసిడెంట్ మీదకే వస్తుంది.  మేమందం కలిసి కట్టుగానే ఉంటాం . ఏకపక్షనిర్ణయాలు లేవు గొడవలు ఏమీ లేవు అని తెలిపారు.  అయితే కొందరి వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి.  వారి వల్ల డ్యాన్సర్లు నష్టపోతున్నారు. దానిని ప్రశ్నిస్తే కొందరికి నచ్చడం లేదు.

►ALSO READ | బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? డ్యాన్స్‌ వీడియోతో కొత్త చర్చ!

మా అసోషియేషన్ నిర్ణయం మీదకు అలాంటి వారిని సస్పెండ్ చేశాము. ఇద్దరు అవినీతి చేశారు. వారికి సపోర్ట్ గా మరికొందరు రాజీనామా చేశారు. కొత్తగా ఎలెక్షన్ పెట్టాలంటూ రాజీనామా అంటున్నారని సుమలత తెలిపారు‌. జనరల్ బాడీ మీటింగ్ లో  బై ఎలెక్షన్స్ కు వెళ్దామంటూ మెజారిటీ మెంబర్స్ తీర్మానించారు‌. అది బై లాస్ లో లేదు. ఎవరైతే రాజీనామాలు చేశారో వారికి ఎలెక్షన్స్ పెట్టాలని ఆప్షన్ మీద  నిన్న సీక్రెట్  ఓటింగ్ జరిగింది. మా పదవీకాలం ఉంది. ఫెడెరేషన్ కు వ్యతిరేకంగా ఎవరు వెళ్లటం లేదు.  రాజీనామా చేసిన వారికి ఉప ఎన్నిక జరపాలని ఎక్కువ మంది కోరారని సుమలతా తెలిపారు.