SI Rajasekharan: పోలీస్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు.. ఎస్‌ఐ రాజశేఖరన్ కన్నుమూత

SI Rajasekharan: పోలీస్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు.. ఎస్‌ఐ రాజశేఖరన్ కన్నుమూత

మలయాళ సీనియర్ నటుడు SI రాజశేఖరన్ (74) కన్నుమూశారు. కొట్టాయం జిల్లా చింగవనంలోని తన నివాసంలో జులై 12, 2026న సాయంత్రం అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని సమాచారం. పోలీస్ అధికారుల పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖరన్, మూడు దశాబ్దాలకుపైగా మలయాళ చిత్రసీమలో విలక్షణ నటుడిగా రాణించారు. 

రాజశేఖరన్ మృతికి సూపర్ స్టార్ మమ్ముట్టి సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. 1980లలో సినీ రంగ ప్రవేశం చేసిన రాజశేఖరన్, రాజావింటే మకాన్, నాయర్ సాబ్, సేతురామ అయ్యర్ సీబీఐ, తప్పాన తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆయన చివరిసారిగా ఒరు సెకండ్ క్లాస్ యాత్ర (2015)లో కనిపించారు. ఆయన మరణంతో మలయాళ సినీ పరిశ్రమ ఓ సీనియర్ నటుడిని కోల్పోయింది.

 పోలీస్ పాత్రలతో.. ఇంటిపేరు SIగా..  

మూడు దశాబ్దాలకుపైగా మలయాళ చిత్రసీమలో కొనసాగిన రాజశేఖరన్.. పోలీస్ ఆఫీసర్, విలన్ పాత్రలను సహజంగా పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. వరుసగా పోలీస్ పాత్రలు చేయడంతోనే ఆయనకు 'ఎస్‌ఐ రాజశేఖరన్' అనే పేరు స్థిరపడిపోయింది. ముఖ్యంగా 'సందర్భ'లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సాబు, 'రాజవింటే మకాని'లో హోం మంత్రి ఎన్. కృష్ణదాస్ సహాయకుడు, 'వళియోరకళక్కళి'లో డాక్టర్, 'ముద్ర'లో జువెనైల్ హోమ్‌లోని పోలీస్ కానిస్టేబుల్ ఉలహన్నన్, 'నాయర్ సబ్'లో జేమ్స్ సహాయకుడు, 'సేతురామయ్యర్ సీబీఐ'లో కన్నూర్ సెంట్రల్ జైలు జైలర్ రాజు, మరియు 'తపన'లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ వంటి విభిన్న పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 

►ALSO READ | Sam Neill: ‘జురాసిక్ పార్క్’ యాక్టర్ కన్నుమూత