Lenin Box Office: ‘లెనిన్’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Lenin Box Office: ‘లెనిన్’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. తొలి రోజు జులై 10న ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

‘‘అఖిల్ 2.0 వచ్చేశాడు.. అతని గర్జనను బాక్సాఫీస్ గట్టిగా వినిపించుకుంది!’’ అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా  తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ సినిమాను ఘనంగా ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వసూళ్లతో అఖిల్ కెరీర్ హయ్యెస్ట్ సాధించి.. అక్కినేని ఫ్యాన్స్కు పండగ తీసుకొచ్చాడు. 

ఇకపోతే, అఖిల్ నటించిన గత చిత్రం ‘ఏజెంట్’ సినిమాని ‘లెనిన్’ అధిగమించింది. ‘ఏజెంట్’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7 నుంచి రూ.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, అందులో ఇండియా నుంచి దాదాపు రూ.5.95 నెట్ సాధించింది. ఇప్పుడు ‘లెనిన్’ అంతకు డబుల్ వసూళ్లు సాధించి అఖిల్ సత్తాచాటాడు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజు భారతదేశంలో రూ.5.90 కోట్ల నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.  ఓవర్సీస్‌లో రూ.3 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.8 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల నుంచే రూ.6 కోట్లకిపైగా గ్రాస్ రాగా, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అక్కినేని అఖిల్ నటనతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించగా, కర్ణాటకలో రూ.65 లక్షల గ్రాస్, తమిళనాడులో రూ.3 లక్షలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రూ.5 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

‘లెనిన్’ కథ:

చిత్తూరు జిల్లాలోని శ్రీ రామాపురం అనే గ్రామంలో భారతం మిట్ట అనే జాతర ఫేమస్. 18 రోజుల పాటు జరిగే ఆ  జాతర రక్తపు చుక్క నేలపై పడకుండా జరగాలన్నది ఊరి కట్టుబాటు. ఆ జాతర పనులు చూస్తుంటాడు లెనిన్ (అఖిల్). అనాథ అయిన తనను ఆ ఊరి పెద్ద జయంతమ్మ  (ఈశ్వరీ రావు) చేరదీస్తుంది. తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో  కలిపి పెంచుతుంది. చిన్నపటి నుండి వసంత్ లెనిన్ స్నేహితులు. డాక్టర్ చదువు ముగించుకుని జాతర సమయానికి ఊరు వస్తాడు వసంత్. ఇక ఆలయ ధర్మకర్త పొజిషన్ కోసం జయంతమ్మ మరిది యతిరాజులు (శివాజీ) ప్రయత్నిస్తుంటాడు. కానీ తన మామ అక్రమ సంతానం అని ఆమె వ్యతిరేకిస్తుంది.

లెనిన్ ను అతను కొడుకులా చూసుకుంటాడు. మరోవైపు కటౌట్ విషయంలో తనను ఎదిరించిన లెనిన్పై ఎమ్మెల్యే రాఘవ రెడ్డి (రమేష్ ఇందిర) రగిలిపోతుంటాడు. ఇదిలా ఉంటే జాతరలో చూసిన  భారతి (భాగ్యశ్రీ బొర్సే) ని ప్రేమిస్తాడు లెనిన్. ఆమె కూడా ప్రేమిస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో వసంత్తో ఆమె పెళ్లి నిశ్చయం అవుతుంది. వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటాడు వసంత్. అయితే దుండగులు తనను చంపే ప్రయత్నం చేస్తారు. లెనిన్ కాపాడతాడు. ఇక పెళ్ళి తర్వాత  పరిస్థితులు అన్నీ లెనిన్, భారతీలకు ప్రతికూలంగా మారతాయి. దానికి కారణం ఎవరు.. మెకవన్నే పులుల్లా దాడి చేసిన వాళ్లపై లెనిన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది అసలు కథ.