బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? డ్యాన్స్‌ వీడియోతో కొత్త చర్చ!

బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? డ్యాన్స్‌ వీడియోతో కొత్త చర్చ!

నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి హాట్ టాపిక్ గా మారారు. లేటెస్ట్ గా ఆమె చేసిన డ్యాన్స్ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ' లవ్ స్టోరీ ' సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సారంగ దరియా' పాటకు తేజస్విని వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి ఆమె ప్రదర్శన చూసిన వాళ్లు 'హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోలేదు' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొద్ది నెలల క్రితం కొరియోగ్రాఫర్ భానుతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో కూడా భారీగా వైరల్అయింది. ఇప్పుడు వచ్చిన కొత్త వీడియోతో తేజస్విని డ్యాన్సింగ్ టాలెంట్‌పై మరింత చర్చ మొదలైంది. ముఖ్యంగా సాయి పల్లవి స్టైల్‌లో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నందమూరి ఫ్యాన్స్.. తండ్రి తగ్గ తనయురాలు.. బాలయ్య రక్తం మరి, ఆ పవర్, ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

►ALSO READ | విజయ్ 'జననాయగన్' కౌంట్‌డౌన్ షురూ.. ఇండియాలో 'A' సర్టిఫికేట్, యూకేలో అన్‌కట్ రచ్చ!

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది... తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇప్పటికే బాలకృష్ణ తదుపరి చిత్ర నిర్మాణ వ్యవహారాల్లో ఆమె కీలకంగా పాల్గొంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కథల ఎంపిక నుంచి ప్రొడక్షన్ పనుల వరకు చురుగ్గా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా మారి ప్రకటనలో కూడా కనిపించారు.

ఈ వరుస పరిణామాలు.. ఇప్పుడు వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోలు చూసిన తర్వాత తేజస్విని వెండితెరపై కనిపించే రోజు దూరంలో లేదనే ప్రచారం ఊపందుకుంది. ఆమె టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే భవిష్యత్తులో సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. బహుశా బాలయ్య నెక్స్ట్ మూవీలోనే ఆమె సర్ప్రైజ్ గెస్ట్ రోల్‌లో మెరిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ నందమూరి వారసురాలి వెండితెర అరంగేట్రం ఉంటుందో లేదో మున్ముందు చూడాలి.