కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ బీచ్‌ను తలపిస్తోంది. డ్యామ్‌లో నీళ్లు తగ్గిపోవడంతో చాలా ప్రాంతం మైదానంలా మారిపోయింది. నీళ్లున్న ప్రాంతంలో గాలికి ఎగిసిపడుతున్న అలలు సముద్రాన్ని గుర్తుకుతెస్తోంది.
ఆదివారం సెలవు కావడం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కరీంనగర్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. ఇసుక, నీటిలో ఆడుతూపాడుతూ సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ, రీల్స్ చేస్తూ సరదాగా గడిపారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
