కేంద్రీయ విద్యాలయ భూమిపూజలో పాము పిల్లల కలకలం.. భయంతో కార్యకర్తల పరుగులు

కేంద్రీయ విద్యాలయ భూమిపూజలో పాము పిల్లల కలకలం.. భయంతో కార్యకర్తల పరుగులు

జగిత్యాలజిల్లా చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో పాము పిల్లలు కలకలం రేపాయి. మంత్రి  అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే  సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, బీజేపీఎంపీ ధర్మపురి అరవింద్  హాజరై  పూమి పూజ చేశారు. ఈ క్రమంలో భూమిపూజ స్టేజీ సమీపంలో నాలుగు పాము పిల్లలు కనిపించడంతో  అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నేతలు, కార్యకర్తలు పరుగులు పెట్టారు. పోలీసులు వచ్చి  పాము పిల్లలను  సమీపంలో పొదల్లోకి వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాలు పిల్లలు చిన్నవి కావడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.