భూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు

భూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో  కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు

జయశంకర్  భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో డ్యూటీ చేస్తున్న జనరల్  అసిస్టెంట్  పృథ్వీపై ప్రమాదవశాత్తు పైపు పడడంతో గాయాలైనట్లు అధికారులు తెలిపారు. తోటి కార్మికులు 108లో ఆసుపత్రికి తరలించారు. గని అధికారులు హాస్పిటల్​కు చేరుకొని కార్మికుడిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.