గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల కోల్‌బ్లాక్ 2 మైనింగ్లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలోని జీఎం ఆఫీస్, బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్‌పై కార్మికులు నినాదాలు చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీకే 1వ గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్పాల్గొని మాట్లాడారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రీజియన్ క్వాలిటీ జీఎం సుజోయ్ మజుందార్, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్లయ్య పాల్గొన్నారు.
కోల్‌బెల్ట్: బీఎంఎస్ నిరంతర పోరాటం ఫలితంగా తాడిచర్ల బొగ్గు బ్లాక్-2 సింగరేణికి కేటాయించారని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ కోల్‌మైన్‌పై బీఎంఎస్ శ్రేణులు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఎంఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రాజు, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్‌కుమార్,సెక్రటరీ వీరన్న, ట్రెజరర్ సతీశ్, లీడర్లు పాల్గొన్నారు.
