నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పాసైన స్టూడెంట్స్‌కు ఫీజులు కట్టకపోవడంతో సర్టిఫికెట్స్ఇవ్వని ప్రైవేట్ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని డీఐఈవో రవికుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఇంటర్ విద్యార్థులు పై చదువుల్లో చేరడానికి టీసీ, బోనోఫైడ్, ఇతర సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలన్నారు. ఇబ్బందిపెట్టే మేనేజ్మెంట్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
