బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి కన్నుమూత

బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మూర్తి కన్నుమూత

బాల్కొండ, వెలుగు : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి (65) గురువారం కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన ఆయన తన స్వగృహంలోనే గుండెపోటుతో చనిపోయారు. బీసీ సంఘాల నాయకులు, బంధువులు తరలివచ్చి మూర్తి డెడ్ బాడీ వద్ద నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.