కామారెడ్డి జిల్లా: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి వివేక్ విరాళం

 కామారెడ్డి జిల్లా: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రి వివేక్ విరాళం

పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్దాపూర్​లో అంబేద్కర్​ విగ్రహం ఏర్పాటు కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి రూ.50 వేలు విరాళంగా అందించినట్లు సామాజిక కార్యకర్త, దళిత నాయకుడు అయ్యాల సంతోష్​​ తెలిపారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రూ.50 వేల చెక్కును గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి వివేక్​కు కృతజ్ఞతలు తెలిపారు.