నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు లారీలు, రెండు కార్లు ఢీ

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు లారీలు, రెండు కార్లు ఢీ

నిజామాబాద్: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో మూడు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కామారెడ్డి నుంచి ఇందల్వాయి వైపు వెళ్తున్న మూడు లారీలు, రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయి.

ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాల రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.