నా ఓర్పును చేతగా నితనంగా భావించవద్దు : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

నా ఓర్పును చేతగా నితనంగా భావించవద్దు : జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో తన ఓర్పును బలహీనతగా భావించవద్దని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీనగర్‌‌లోని హజ్రత్‌‌బాల్‌‌లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

జమ్మూ కాశ్మీర్‌‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి కేంద్రం చెబుతున్న 'సరైన సమయం' అనే మాటలకు అసలు అర్థం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదా సాధనకై ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.