బహమాస్‌‌లో విమానం కూలి...10 మంది మృతి

బహమాస్‌‌లో విమానం కూలి...10 మంది మృతి

నాసా: బహమాస్‌‌లో ఉత్తర ఆండ్రోస్ సమీపంలోని జలాల్లో శుక్రవారం ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం పట్ల బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గురైన విమానాన్ని 'సెస్నా 402'గా అధికారులు గుర్తించారు. 

ఇది రాజధాని నాసా  విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్ వైపు వెళ్తుండగా కూలిపోయింది. మరోవైపు, ఫ్లెమింగో ఎయిర్‌‌కు చెందిన మరో విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. మాయాగువానా వెళ్లాల్సిన ఆ విమానాన్ని పైలట్ చాకచక్యంగా తిరిగి నాసాలో ల్యాండ్ చేశారు.