ఇరాన్ అమెరికా మధ్య రాజుకున్న అశాంతి ప్రపంచం మెుత్తానికి వ్యాపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా విలువైన లోహాల జోలికి పోవటం లేదు. వీటి కంటే క్వాలిటి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని భావిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వారాంతంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
జూలై 11న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.49 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 433గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 230గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 11, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి కూడా రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.
