జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గ్రహాల్లో చంద్రుడు తన రాశిని అత్యంత వేగంగా మార్చుకుంటాడని చెప్పబడింది. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జులై 10 వతేది శుక్రవారం యోగిని ఏకాదశి రోజున చంద్రుడు వృషభరాశిలోకి సాయంత్రం 6:44 గంటలకు ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
చంద్రుడు వృషభరాశిలో సంచారం వలన నాలుగు రాశుల వారు భారీగా లాభాలు పొందుతారు. ఈ రాశి వారు ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుందని పండితులు చెబుతుననారు. శుభవార్తలు వినడంతోపాటు.. ఆనందం కూడా రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: యోగిని ఏకాదశి రోజు చంద్రుని సంచారంలో మార్పు ఈ రాశి వారికి వారికి భారీ లాభాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఈ సమయం వీరికి చాలా బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. అదృష్టం మీ తలుపు తడుతుంది. వ్యాపారస్తులకు ఇది ఒక వరం వంటిది. సక్సెస్‌ను కూడా అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో లాభం రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈరాశి వారికి చంద్రుడు సంచారంలో మార్పుతో చాలా మంచి ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. . ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. సోదరుల నుంచి సపోర్ట్ అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా సక్రమంగా పూర్తి చేస్తారు.మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకున్నవి అనుకున్న విధంగా సాగిపోతాయి.,
తులా రాశి : వృషభరాశిలో చంద్రుడు సంచారం వలన ఈ రాశి వారికి సమాజంలోని వ్యక్తులకు కొత్త గుర్తింపు లభిస్తుంది. ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలుంటాయి. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బలమైన కోరికలు విజయవంతంగా నెరవేరుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా సపోర్ట్ ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: చంద్రుని సంచారంలో మార్పు ఈ రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు.. విలాసవంతమైన జీవితం ఏర్పడుతుంది. కెరీర్ పై దృష్టి పెడితే సక్సెస్ వీరి సొంతం. ఉద్యోగస్తులు ఆఫీసులో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది అద్భుతమైన సమయం. కొత్త ఉద్యోగాన్ని విజయవంతంగా పొందుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సానుకూల మార్పులు చూస్తారు. అంతేకాదు వీరు ఆస్తి, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైనవారితో సమయం గడుపుతారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
