అతని పేరు లలిత్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగి. రవాణా శాఖలో పని చేస్తున్నాడు. నెల జీతం 80 వేల రూపాయలు. అతని ఆస్తులు ఎంతో తెలుసా అక్షరాల 300 కోట్ల రూపాయలపైనే.. అవును.. మీరు విన్నది నిజం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లలిత్ కుమార్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు.. ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందనే విషయాలను రిపోర్ట్ రాశారు. ఈ రిపోర్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది., ఈ విషయాలు చదివితే మీకు మైండ్ బ్లాంక్ కావటం ఖాయం..
గోడల్లో.. సీలింగ్ పైన.. సోఫాల్లో డబ్బు కట్టలు :
రవాణా శాఖలో ఉన్నతాధికారిగా పని చేసిన లలిత్ కుమార్ తన ఇంటి మొత్తాన్ని మార్చేశారు. ప్లాస్టిక్ డబ్బాల్లో డబ్బు కట్టలు పెట్టి.. వాటిని గోడల మధ్య పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టింగ్ చేశాడు. ఇంట్లో సోఫాలను ప్రత్యేకంగా తయారు చేశాడు.. సోఫాల మధ్యలో ఐరన్ పెట్టెలు పెట్టి.. అందులో డబ్బు కట్టలు పెట్టాడు. ఇంట్లో ప్రతి గదిలో ఫాల్ సీలింగ్ చేశాడు. ఈ సీలింగ్ పైన ప్లాస్టింగ్ కవర్లలో డబ్బు కట్టలు పెట్టాడు.
ఇంట్లోని దేవుడి గదిని ప్రత్యేకంగా డెకరేట్ చేశాడు. దేవుడు పటాల వెనక బంగారం బిస్కెట్లు దాచాడు.. వంట గదిలో వంట సామాగ్రి పెట్టుకునే ఇంటీరియల్ ను రెండు అరలుగా మార్చాడు.. అందులో డబ్బు, బంగారం పెట్టాడు. అంతేనా.. ఇంట్లో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. అందులో డబుల్ కాట్ బెడ్స్ ఉన్నాయి. బెడ్స్ కింద ప్రత్యేకంగా తయారు చేయించిన అరల్లో బంగారం బిస్కెట్లు, నోట్ల కట్టలు పెట్టాడు. ఇంట్లో అక్కడా ఇక్కడా అని కాదు.. ఆ ఇంట్లోని ప్రతి అణువులోనూ డబ్బులు, బంగారం, ఆస్తుల డాక్యుమెంట్లు ఇలా.. ఆ ఇళ్లంతా స్వర్ణమయంగా ఉంది.
గోడల్లోని డబ్బును ఎలా గుర్తించారు అని అధికారులను ప్రశ్నిస్తే.. ఇంట్లో గోడలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయి. కొన్ని గోడలు మందంగా.. మరికొన్ని గోడలు పలచగా ఉన్నాయి. అప్పుడే మాకు డౌట్ వచ్చింది. ఐదారు గంటలు విచారణ చేసినా ఎలాంటి సమాధానం లేదు.. దీంతో ఆ గోడలను పగలగొట్టాం.. డబ్బు కట్టలు బయటపడ్డాయి అని వెల్లడించారు అధికారు.
ALSO READ : అయోధ్య రామ మందిర స్కామ్ భయం
నెలకు 80 వేల రూపాయల జీతంతో పని చేస్తున్న రవాణా శాఖ అధికారి ఇంటి నుంచి ఎంత బయటపడిందో తెలుసా.. అక్షరాల 35 కోట్ల రూపాయలు. కోటి 65 లక్షల రూపాయల 500 నోట్లు ఉన్నాయి. 35 కేజీల బంగారం ఆభరణాలు, బంగారం బిస్కెట్లు ఉన్నాయి. బ్యాంకుల్లో కోట్ల రూపాయల ఫిక్సుడు డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడు. 12 ఓపెన్ ప్లాట్లు ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి. నాలుగు లగ్జరీ అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా అతని ఆస్తుల విలువ 300 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత అవినీతి చేస్తున్నాడా అనటానికి.. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఏ విధంగా ఉందో అనటానికి ఇదే ఉదాహారణ..
