Shreyas Iyer Captaincy: భారత టీ20 క్రికెట్‌లో ఇప్పుడు సరికొత్త అలజడి కొనసాగుతుంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో వరుస సిరీస్ పరాజయాలతో తీవ్రంగా కుంగిపోతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వ శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, అతని భవిష్యత్తుపై ఇండియన్ టీమ్ సహాయక కోచ్ రియాన్ టెన్ డోషేట్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సూర్య వయస్సుపై కోచ్ షాకింగ్ కామెంట్స్:
జట్టు వరుసగా ఓడిపోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ భారత టీ20 కెప్టెన్‌కు సపోర్ట్ చేశాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్ గా నిరూపించుకున్నప్పటికీ, అతని వయస్సును, భవిష్యత్తు ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. కెప్టెన్ మారినప్పుడు, జట్టు ట్రాన్సిషన్ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఓటములు ఎదురు కావడం సహజమన్నారు. అంతమాత్రానికే శ్రేయస్‌ను తప్పుబట్టడం పద్దతికాదని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.
కెప్టెన్‌కు సమయం ఇవాలన్న మేనేజ్‌మెంట్:
భారత జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం జట్టులో సమతుల్యత లోపించడమేనని అసిస్టెంట్ కోచ్ డోస్చేట్ తెలిపాడు. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు ఈ టూరుకి అందుబాటులో లేకపోవడం కూడా టీమ్ ప్రదర్శనపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు, క్రీజులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లు అతని కెప్టెన్సీ శైలికి ఇంకా అలవాటు లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ తెలిపాడు.
గంభీర్‌కు రెస్ట్.. వీవీఎస్ లక్ష్మన్‌కు పగ్గాలు:
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. కఠినమైన పరిస్థితుల్లో అనుభవం లేని ప్లేయర్స్ ని బరిలోకి దించడంపై విమర్శలు రావడంతో.. రాబోయే జింబాబ్వే టూరుతో పాటు ఆసియా క్రీడలకు గంభీర్‌కు రెస్ట్ ఇచ్చి, వీవీఎస్ లక్ష్మన్‌ను కోచ్‌గా పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రేయస్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్:
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగబోయే ఐదో టీ20 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యానికి అత్యంత కీలకం కానుంది. ఈ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి అయ్యర్ తన కెప్టెన్సీ పరువును కాపాడుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.
🚨 RYAN TEN DOESCHATE BACKS SHREYAS IYER: "HE NEEDS TIME!" 🚨
— Mufaddal Shailu (@Shailu_15Jul) July 10, 2026
"Shreyas deserves time as captain. Don't judge him after just a few matches. His leadership, accountability, and batting parameters are highly commendable." 🎙️🔥 pic.twitter.com/rVOvKziQ8g
"We are underachieving in foreign conditions." #TeamIndia's assistant coach, #RyantenDoeschate, outlines the importance of excelling in foreign conditions. #ENGvIND 👉 5th T20I on SAT, 11th JULY, 6 PM | Streaming LIVE on JioHotstar. pic.twitter.com/i3y49Nc3L6
— Star Sports (@StarSportsIndia) July 10, 2026
