సినీ పరిశ్రమలో ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. యువ దర్శకుడు సాయి మార్తాండ్ విషయంలో అదే నిజమైంది. టెక్ మహీంద్రాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సంచలనంగా మారారు. టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. 2025లో ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం'లిటిల్ హార్ట్స్' (Little Hearts) మూవీ టాలీవుడ్‌లో అతిపెద్ద సర్‌ప్రైజ్ కమర్షియల్ గా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు . ఈ క్రమంలోనే ఆయన గతంలో ఐటీ లైఫ్ గురించి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆఫీస్ వర్క్ అంటే ఇదే!
టెక్ మహీంద్రాలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేసిన సాయి మార్తాండ్.. ఇటీవల తన కార్పొరేట్ లైఫ్‌ను గుర్తుచేసుకుంటూ ఒక క్రేజీ పోస్ట్ పెట్టాడు. 2021 నుండి 2023 వరకు పూణే ఆఫీస్ పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఎంజాయ్ చేసిన ఈయన, తాను అసలు ఐడియల్ ఎంప్లాయ్‌ని కాదంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ఆఫీస్ టైమింగ్స్‌లో హ్యాపీగా నిద్రపోవడం, కజిన్స్‌తో తిరగడం, వందల కొద్దీ సినిమాలు చూస్తూ, డైరెక్టర్ల ఇంటర్వ్యూలు ఫాలో అవ్వడమే నా డ్యూటీ అంటూ నెటిజన్లను నవ్వించాడు. సినిమాలపై ఉన్న పిచ్చితో 2023 ఏప్రిల్ 12న జాబ్‌కు రిజైన్ చేసి, ఫుల్ టైమ్ మేకప్ వేసుకున్నాడు.
రూ. 2.4 కోట్ల బడ్జెట్.. రూ. 40 కోట్ల కలెక్షన్లు..
మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగారం జంటగా కేవలం 32 రోజుల్లో, రూ. 2.4 కోట్ల పరిమిత బడ్జెట్‌తో సాయి మార్తాండ్ తెరకెక్కించిన క్లీన్ రోమ్-కామ్ 'లిటిల్ హార్ట్స్'. బాక్సాఫీస్ వద్ద ఈ చిన్న సినిమా ఏకంగా రూ. 40 కోట్లు కొల్లగొట్టి 2025లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని లాంటి టాప్ హీరోలు సైతం ఈ సినిమాను, సాయి ప్రతిభను మెచ్చుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ మూవీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.
నెక్స్ట్ అడివి శేష్‌తో!
ఈ సంచలన విజయానికి గానూ సాయి మార్తాండ్ ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 'బెస్ట్ డెబ్యూ డైరెక్టర్' అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ సెన్సేషన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ హీరో అడివి శేష్‌తో లైన్‌లో పెట్టాడు. శేష్ 'G2' పూర్తి చేసిన వెంటనే ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కనుంది. టెక్ మహీంద్రా ఐటీ ఇంజనీర్ కాస్తా ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోవడం నిజంగా ఇన్‌స్పైరింగ్ కదా .. అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
