మలయాళ స్టార్ యాక్టర్స్ టోవినో థామస్ మరియు బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘అతిరథి’ (Athirathi). కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 19, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్లో ట్రెండ్ అవుతూ అట్రాక్ట్ చేస్తోంది. అరుణ్ అనిరుధ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
അടിയുടെ പൊടിപൂരം ഇന്നു മുതൽ... 💥#Athiradi streaming now, only on SonyLIV ➡️https://t.co/0K4I1gyfZS@basiljoseph25 @ttovino @Vineethsreeni84 #ShanRahman @riyashibu_ #ShelvinJames #ArunAnirudhan #DrAnanthu #SameerThahir#AthiradiOnSonyLIV #SonyLIV #SonyLIVMalayalam pic.twitter.com/ZKrmMIvLG1
— Sony LIV (@SonyLIV) June 18, 2026
కథేంటంటే:
జోసెఫ్ (విష్ణు అగస్త్య) ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే టైంలో ప్రతి ఏడాది ఒక ఫెస్ట్ నిర్వహించేవారు. ఒకసారి ఫెస్ట్ సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోతారు. దానికి కారణం జోసెఫ్ అనే ముద్ర పడిపోతుంది. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆ ఫెస్ట్‌ను నిషేధిస్తారు. కాలేజీలో తన గురించి ఆ బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడటంతో జోసెఫ్ మానసికంగా కుంగిపోతాడు. ఇది గతం.
ప్రస్తుతం అదే కాలేజీలో చేరిన జోసెఫ్ తమ్ముడు శ్యామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్) ఒక గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకుంటాడు. ఆ ఫెస్ట్‌ను మళ్లీ జరిపించి, జోసెఫ్‌తోపాటు తన బ్యాచ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్రయత్నాలను స్వాతి (రియా శిబూ) సపోర్ట్ చేస్తుంటుంది. సరిగ్గా ఫెస్ట్ నిర్వహించే టైంలోనే కుట్టి గ్యాంగ్ కుట్టన్ (టొవినో థామస్)తో గొడవ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజ్ ఫెస్ట్ జరిగిందా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ కామెడీగా తెరకెక్కిన 'అతిరథి' మొదటి నుంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. కాలేజ్ చుట్టూ అల్లుకున్న కథ, స్నేహం, కుటుంబ బంధాలు, ఎమోషన్స్‌ను దర్శకుడు అరుణ్ అనిరుధ్ కమర్షియల్ టచ్‌తో చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు, కాలేజ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు కథలో వచ్చే ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. టోవినో థామస్, బాసిల్ జోసెఫ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలు ఊహించదగ్గలా ఉండటం, కథ అక్కడక్కడా నెమ్మదించడం మైనస్‌గా అనిపిస్తుంది. అయినప్పటికీ కామెడీ, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో సినిమా చివరి వరకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
