ప్రధాని మోదీ ఆస్త్రేలియా పర్యటన..యూరేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం

ప్రధాని మోదీ ఆస్త్రేలియా పర్యటన..యూరేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం

భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక అణుశక్తి సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అణుశక్తి రంగంలో వినియోగం కోసం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులకు అధికారికంగా మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడం, ఆస్ట్రేలియా వనరుల రంగానికి కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించనుంది.

భారత్‌ను ఆస్ట్రేలియాకు వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్. పౌర అణుశక్తి ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా ద్వైపాక్షిక సహకారం మరింత బలపడిందన్నారు.

సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు పలు రంగాల్లో చారిత్రాత్మక అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. అణుశక్తి ఒప్పందం స్వచ్ఛ ఇంధన భద్రతకు కొత్త ఊపునిస్తుందన్నారు. మరోవైపు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ప్రధాని మోదీ న్యూజిలాండ్‌కు వెళ్లనున్నారు.