Argentina vs Egypt Controversy: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో అంపైరింగ్ నిర్ణయాలపై వస్తున్న విమర్శలపై ఫిఫా చీఫ్ రెఫరింగ్ ఆఫీసర్ పియర్లూయిగి కొలినా తీవ్రంగా మండిపడ్డారు. మ్యాచ్ అఫీషియల్స్ నిష్పాక్షికతను ఎవరూ శంకించలేరని, వారు ఎవరికీ లొంగరని స్పష్టం చేశారు. మాపై ఎవరి ప్రభావం ఉండదు, చివరికి ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో కూడా మమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. ఆయనే మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పుకొచ్చారు. నిందలు వేయడంతో రెఫరీలు, వారి కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
ఈజిప్ట్ గోల్ క్యాన్సిల్.. అసలు ముచ్చట ఇదే:
అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్ కొట్టిన ఒక గోల్‌ను VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) రివ్యూ తర్వాత క్యాన్సిల్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై కొలినా క్లారిటీ ఇస్తూ.. గోల్ కొట్టే ప్రాసెస్‌లో (APP) అంతకంటే ముందు ఏదైనా ఫౌల్ జరిగితే VAR జోక్యం చేసుకుంటుంది. ఈజిప్ట్ ప్లేయర్ మర్వాన్ అటియా, అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ కాలును తొక్కడం స్పష్టంగా కనిపించింది. ఫౌల్ చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, ఫౌల్ ఈజ్ ఫౌల్! అందుకే ఆ గోల్‌ను రద్దు చేశామని తేల్చి చెప్పారు.
ఈజిప్ట్ ఆశలు ఆవిరి.. మెస్సీ సేన విజయం:
రెఫరీ నిర్ణయంతో ఈజిప్ట్ గోల్ క్యాన్సిల్ అవ్వడం ఆ మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా మారింది. అనంతరం ఈజిప్ట్ 2–0 ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ.. అర్జెంటీనా ఊహించని రీతిలో పుంజుకుంది. 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమేరో, 83వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ గోల్స్ కొట్టి స్కోరును ఈక్వల్ చేసేశారు. ఇక ఇంజూరీ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ విన్నింగ్ గోల్ కొట్టడంతో అర్జెంటీనా 3–2తో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో రగిలిపోయిన ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్.. ఫిఫా ఫేర్ ప్లేని మర్చిపోయిందని, అర్జెంటీనాకు ఫేవర్ చేసిందని ఆరోపణలు చేశారు.
వివాదంలోకి ట్రంప్.. అమెరికా ప్లేయర్ రెడ్ కార్డ్ బ్యాన్ రద్దు:
ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026లో అంపైరింగ్ వివాదాలు ఇంతటితో ఆగలేదు. అమెరికా ఫార్వర్డ్ ప్లేయర్ ఫొలారిన్ బలోగన్ కి గత మ్యాచ్‌లో రెడ్ కార్డ్ వచ్చిన్నప్పటికీ, రూల్స్ ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించకుండా రౌండ్ ఆఫ్ 16 ఆడటానికి ఫిఫా పర్మిషన్ ఇచ్చింది. దీనిపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫిఫా చీఫ్ ఇన్‌ఫాంటినోతో మాట్లాడి ఈ రెడ్ కార్డుని క్యాన్సిల్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఈ పొలిటికల్ ప్రెజర్ల బ్యాక్‌డ్రాప్‌పై కూడా పియర్లూయిగి కొలినా స్పందిస్తూ.. పొలిటికల్ లీడర్లు లేదా ప్రెసిడెంట్లు ఎవరు చెప్పినా తాము వినం, రెఫరింగ్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తుందని వెల్లడించారు.
