నాతో పెట్టుకోకు, రోనాల్దిన్హోలా జైల్లో పెట్టిస్తా.. ఎంబాప్పేని పచ్చి బూతులు తిట్టిన పరాగ్వే సెనేటర్!

నాతో పెట్టుకోకు, రోనాల్దిన్హోలా జైల్లో పెట్టిస్తా.. ఎంబాప్పేని పచ్చి బూతులు తిట్టిన పరాగ్వే సెనేటర్!

Celeste Amarilla vs Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) మ్యాచ్‌లో పరాగ్వేపై ఫ్రాన్స్ 1–0 తేడాతో విజయం సాధించినప్పటి నుంచి.. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పే (Kylian Mbappe), పరాగ్వే మహిళా సెనేటర్ సెలెస్టే అమరిల్లా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా ఎంబాప్పే తనను ఒక నీచమైన మహిళ, ఆమె పదవికి అనర్హురాలు అని విమర్శించడంతో ఈ వివాదం పీక్స్‌కు చేరింది. దీనికి కౌంటర్‌గా సెనేటర్ అమరిల్లా నిన్న (బుధవారం) సెనేట్ సభలోనే ఎంబాప్పేను అత్యంత ఘోరమైన పదజాలంతో (Son of a b****) తిడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మా పరాగ్వే గోల్‌కీపర్కి హ్యాండ్‌షేక్ ఇవ్వవా?: 

మ్యాచ్ ముగిసిన తర్వాత పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్‌కు ఎంబాప్పే కనీసం హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడమే ఈ వివాదానికి మూలకారణం. దీనిపై అమరిల్లా మాట్లాడుతూ.. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న ఒక పరాగ్వే కుర్రాడు ఎంతో వినయంతో చేయి చాపితే, ఈ ఎంబాప్పే అతనికి హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా మొహం మీదే అరిచాడు.. ఇదా ఫ్రెంచ్ సంస్కృతి? ఒక నిజమైన ఫ్రెంచ్ వ్యక్తి ఎప్పుడూ అలా చేయడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ అంటే రూసో, డెస్కార్టెస్, విక్టర్ హ్యూగో వంటి గొప్ప మేధావుల సంస్కృతి.. ఆ Legacy మొత్తాన్ని ఎంబాప్పే లాంటి వాడితో పోల్చలేనని తేల్చి చెప్పింది.

నాతో పెట్టుకోకు.. రోనాల్డీన్హోలా జైల్లో పెట్టిస్తా: 

అంతటితో ఆగకుండా సెనేటర్ అమరిల్లా తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎంబాప్పేకు బహిరంగంగానే వార్నింగ్ పోస్ట్ పెట్టింది. గతంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డీన్హో (Ronaldinho) పరాగ్వేలో జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎంబాప్పేను భయపెట్టే ప్రయత్నం చేసింది. పరాగ్వే వాళ్లతో పెట్టుకోకు ఎంబాప్పే, నన్ను తక్కువ అంచనా వేయకు. నీపై జెండర్ వయోలెన్స్, పొలిటికల్ వయోలెన్స్ కేసు పెట్టి కోర్టుకు ఈడుస్తా.. నాకు వెంటనే క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ గ్యారెంటీ అంటూ హెచ్చరించింది. 

గొడవలు కాదు.. క్వార్టర్స్ పైనే ఎంబాప్పే ఫోకస్:

ఫ్రాన్స్, మొరాకో మధ్య జరగబోయే హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కంటే ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫ్రాన్స్ హెడ్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ (Didier Deschamps)కు ఈ వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ ఆఫ్-ఫీల్డ్ వివాదాలతో ఎంబాప్పే మైండ్ అస్సలు డిస్టర్బ్ అవ్వలేదని కోచ్ స్పష్టం చేశారు. కిలియన్ మానసికంగా చాలా బలంగా, ప్రశాంతంగా ఉన్నాడు. రేపటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం అతను పూర్తిగా సిద్ధమయ్యాడని కోచ్ డెస్చాంప్స్ చెప్పుకొచ్చారు.