పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్

పోక్సో కేసులో  బండి భగీరథ్ కు  తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూనే... పలు కఠిన నిబంధనలను విధించింది ఉన్నత న్యాయస్థానం. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయొద్దని, విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించింది. ఈ కేసులో గత మే 16న అరెస్ట్ అయిన బండి భగీరథ్.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, జులై 6న తీర్పును రిజర్వ్ చేయగా... ఇవాళ జులై 9న తుది తీర్పును వెలువరించింది. విచారణ సమయంలో బాధితురాలి తరపు న్యాయవాది మరియు పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథకు బెయిల్ ఇవ్వద్దంటూ వాదించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టు ముందు ఉంచారు.

అభియోగాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, ఇరు వర్గాల సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు నిందితుడికి కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు రెండు నెలల తర్వాత బండి భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు.