141 కిమీ వేగంతో వచ్చిన బంతి.. షాట్ మాత్రం 360 డిగ్రీలు.. శ్రేయస్ కొట్టిన సిక్స్ చూస్తే షాకే!

141 కిమీ వేగంతో వచ్చిన బంతి.. షాట్ మాత్రం 360 డిగ్రీలు.. శ్రేయస్ కొట్టిన సిక్స్ చూస్తే షాకే!

Shreyas Iyer Crazy Shot: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఓటమిపాలైనప్పటికీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఒక అద్భుతమైన షాట్ మాత్రం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బ్రిస్టల్‌లోని గ్లౌసెస్టర్‌షైర్ క్రికెట్ స్టేడియంలో నిన్న (జులై 9న, గురువారం) జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని అయ్యర్ సిక్సర్‌గా మలిచిన తీరు అభిమానులను, కామెంటేటర్లను సైతం షాక్ కి గురి చేసింది.  

141 కిలోమీటర్ల వేగం.. అదిరిపోయే అప్పర్ కట్:

ఇన్నింగ్స్ మధ్యలో జోఫ్రా ఆర్చర్ 141 కిలోమీటర్ల వేగంతో ఒక షార్ట్ పిచ్ బంతిని విసిరాడు. సాధారణంగా బ్యాటర్లు ఇలాంటి బంతులను పుల్ లేదా హుక్ షాట్స్ ఆడటానికి ట్రై చేస్తారు.. కానీ, అయ్యర్ మాత్రం అత్యంత చాకచక్యంగా కిందకు వంగుతూ, వెనక్కి లీన్ అయి.. బంతి వేగాన్ని వాడుకుంటూ థర్డ్-మ్యాన్ మీదుగా ఒక కిరాక్ అప్పర్-కట్ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా బౌండరీ అవతల పడి సిక్సర్‌గా మారింది. శ్రేయస్ అయ్యర్ యొక్క టైమింగ్‌కు ఈ షాట్ ఒక నిదర్శనంగా నిలిచింది.

సోషల్ మీడియాలో కెప్టెన్ శ్రేయస్ ట్రెండింగ్: 

ఈ అద్భుతమైన షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సిరీస్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బాల్‌పై శ్రేయస్ ఆడిన క్రేజీ షాట్ ఇది అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. వాట్ ఎ షాట్ కెప్టెన్ అయ్యర్.. ఆర్చర్‌కు గట్టి సమాధానం ఇచ్చావంటూ కొనియాడాడు.

►ALSO READ | 2–0తో మొరాకోపై గెలుపు.. సెమీస్‌లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.. ఎంబాపె 100 గోల్స్ ఫీట్

కెప్టెన్ ఇన్నింగ్స్: 

టాప్ ఆర్డర్ మరోసారి ఘోరంగా విఫలమై, జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి భారత్‌కి గౌరవపరమైన స్కోర్ ఆందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ముందుండి నడిపిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఈ ఒంటరి పోరాటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158/7 రన్స్ చేయగలిగింది. కానీ ఇంగ్లండ్ మాత్రం కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 13 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసేసింది.