2–0తో మొరాకోపై గెలుపు.. సెమీస్‌లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.. ఎంబాపె 100 గోల్స్ ఫీట్

2–0తో మొరాకోపై గెలుపు.. సెమీస్‌లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.. ఎంబాపె 100 గోల్స్ ఫీట్

France vs Morocco: ఫిఫా వరల్డ్ కప్- (FIFA World Cup 2026) టోర్నీలో ఫ్రాన్స్ టీమ్ జోరు ఏమాత్రం తగ్గట్లేదు.. ఈ ఫ్రెంచ్ జట్టు మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన నాకౌట్ పోరులో 2–0తేడాతో గోల్స్ చేసి మొరాకోను ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో సెమీఫైనల్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకుంది. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె కిరాక్ ఆట తీరును ప్రదర్శించాడు. ఈ గెలుపుతో ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీఫైనల్‌కు చేరిన టీమ్ గా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది.

మొరాకోపై ఫ్రాన్స్ దూకుడు: 

మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ స్టేడియంలో దూకుడుగా ఆడింది. బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో పెట్టుకుని ఆటపై పట్టు సాధించింది. ఈ క్రమంలో గోల్ చేయడానికి 30వ నిమిషంలో ఫ్రాన్స్ కి మంచి ఛాన్స్ దొరికింది. స్టార్ ప్లేయర్ ఎంబాపె మొరాకో డిఫెన్స్‌ను దాటుకుంటూ బాక్స్ లోపలికి వెళ్లి, మొరాకో డిఫెండర్ నౌసైర్ మజ్రావోయి అతడిని కిందపడేశాడు. దీంతో రెఫరీ ఫ్రాన్స్‌కు పెనాల్టీ ప్రకటించారు. ఎంబాపె షాట్‌ కొట్టగా, మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో అద్భుతమైన డైవ్‌తో ఎంబాపె కొట్టిన బంతిని ఈజీగా పట్టుకుని ఫ్రాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోరు 0–0తో ఈక్వల్ గా నిలిచాయి. 

సెకండాఫ్‌లో దుమ్మురేపిన ఫ్రాన్స్:   

సెకండాఫ్‌లో మొరాకో జట్టు పుంజుకోవడానికి ట్రై చేసింది. కానీ, ఫ్రాన్స్ ఆ జట్టును అడ్డుకుంది. మ్యాచ్ 60వ నిమిషంలో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె, బాక్స్ పైభాగం నుంచి బంతిని నెట్ ఫార్ కార్నర్‌లోకి పంపించాడు. గోల్‌కీపర్ బోనో ఎంత ప్రయత్నించినా ఆ బంతిని మాత్రం ఆపలేకపోయాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్ 1–0 ఆధిక్యం సాధించింది. ఫస్ట్ గోల్ వచ్చిన ఉత్సాహంలో ఫ్రాన్స్ మరింత వేగంగా ఆడింది. మొరాకో జట్టు కోలుకునే లోపే ఉస్మాన్ డెంబెలే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. డూయే అందించిన పాస్‌ను డెంబెలే బంతిని నెట్ లోకి పంపించాడంతో ఫ్రాన్స్ 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

►ALSO READ | నేను ఒక్కడినే ఆడితే గెలవలేం.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారు: శ్రేయస్

సర్వశక్తులు ఒడ్డిన మొరాకో: 

రెండు గోల్స్ వెనుకబడిన మొరాకో టీమ్ మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి తమ స్టార్ ప్లేయర్స్ సోఫియాన్ రహిమి, సోఫియాన్ అమ్రబాత్, జకారియా ఎల్ ఊహాదీలను సబ్‌స్టిట్యూట్‌లుగా బరిలోకి దించింది. కానీ, ఫలితం మాత్రం దక్కలేదు.. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో మొరాకో గోల్ కోసం సర్వశక్తులు ఒడ్డించింది. చివరి నిమిషాల్లో ఫ్రాన్స్ తరఫున సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మాతెటా, బార్కోలా జోడి మూడో గోల్ కోసం గట్టిగానే ట్రై చేసింది.. కానీ, సాధ్యం కాలేదు.. దీంతో 2–0తో ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. 

ఎంబాపె కొత్త చరిత్ర: 

ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపె అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పలు రికార్డులు సృష్టించాడు. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో నేరుగా 100 గోల్స్‌లో భాగస్వామ్యం ఉన్న ఫస్ట్ ప్లేయర్ గా ఎంబాపె నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఫ్రాన్స్ తరఫున అతను ఇప్పటి వరకు వ్యక్తిగతంగా 64 గోల్స్ చేయగా.. ఇప్పటి వరకు 36 గోల్స్ అసిస్ట్‌లు అందించాడు. దీంతో 100 గోల్స్ మైలురాయిని ఎంబాపె అందుకున్నాడు.

ప్రపంచకప్‌లో ఎంబాపె గోల్స్: 

2018, 2022, 2026 ఎడిషన్లన్నింటిలో కలిపి ఎంబాపె వరల్డ్ కప్‌లో తన మొత్తం గోల్స్ సంఖ్యను 20కి షేర్ చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన లియోనెల్ మెస్సీ (21 గోల్స్) ఆల్-టైమ్ రికార్డుకు ఎంబాపె కేవలం ఒకే ఒక్క గోల్ దూరంలో నిలిచాడు. ప్రస్తుత 2026 మెగా టోర్నీలో ఎంబాపెకు ఇది 8వ గోల్.. దీంతో మెస్సీతో కలిసి ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా గోల్డెన్ బూట్ రేసులో సంయుక్తంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 

గాయంపై ఫ్రాన్స్ కెప్టెన్ క్లారిటీ:  

ఈ మ్యాచ్‌లో చివరి 15 నిమిషాలు మిగిలి ఉండగా ఎంబాపె స్థానంలో జీన్-ఫిలిప్ మాతెటా సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్ లోకి వచ్చాడు. దీంతో ఎంబాపె గాయపడ్డాడనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ తర్వాత ఎంబాపె మాట్లాడుతూ.. అది చాలా చిన్న యాంకెల్ గాయం మాత్రమే.. నేను బాగున్నానని చెప్పాడు. ఆ సమయంలో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడానికి నాకంటే మాతెటా అయితేనే బాగా సెట్ అవుతాడనే చెప్పుకొచ్చాడు. తన ఫిట్‌నెస్‌ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు.