IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టీ20లో ఓడిన భారత్ సిరీస్ కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షంతో క్యాన్సిల్ కావడంతో పాటు మిగతా 3 మ్యాచ్‌ల్లో శ్రేయస్ సేన వరుసగా ఓడిపోయింది. దీంతో 0–3 తేడాతో ఇప్పటికే సిరీస్ ఓడింది. ఇక మిగిలి ఉన్న ఏకైక లాస్ట్ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం 0–4తో ఓడించాలనే ఉత్సాహంతో ఉంది. ఇక నాలుగో మ్యాచ్ అనంతరం ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
తప్పు చేసింది మొత్తం వాళ్లే:
మ్యాచ్ అనంతరం టీమ్ మొత్తాన్ని ఒక చోటకు చేర్చి.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గంభీర్ ఆవేశంతో ఊగిపోయినట్లు, ప్లేయర్స్ చెత్త ప్రదర్శనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇందుకేనా మిమ్మల్ని జట్టులోకి తీసుకుంది, 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఏంటి?, మీ బౌలింగ్ మరీ ఫేలవంగా ఉందంటూ ఒక్కొక్కరిపై పాయింట్ అవుట్ చేసి మరీ తప్పులు ఎత్తిచూపినట్లు సమాచారం. అలాగే కెప్టెన్ అయ్యర్ సైతం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ వైఫల్యంపై తోటి ఆటగాళ్లని కడిగిపారేసినట్లు టాక్ నడుస్తుంది.
ALSO READ : భారత జట్టులో ప్రక్షాళనకు రంగం సిద్ధం..
హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వర్షం:
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తుంది. తన సొంత నిర్ణయాలతో జట్టులోకి క్వాలిటీ లేని ఆటగాళ్లని తీసుకొచ్చి టీమ్ మొత్తాన్ని సర్వ నాశనం చేస్తున్నాడని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీపై కోపంతో ఆర్సీబీ జట్టులో ఉన్న మంచి మంచి ప్లేయర్లను భారత జట్టులోకి తీసుకోకుండా.. అంతా స్క్రాప్ ప్లేయర్స్ ని తీసుకొచ్చి.. అంతర్జాతీయ వేదికగాపై ఇండియా పరువు తీస్తున్నాడంటూ గంభీర్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
