టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,' మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' . ఎకేఎన్ నిర్మాణంలో ' బేబీ' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్యూట్ అండ్ లవ్ స్టోరీని జూలై 24న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ తో కిరణ్ అబ్బవరం ఢీ..
కానీ ఈ లవ్ స్టోరీకి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊహించని భారీ సవాల్ ఎదురుకాబోతోంది. తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్ర 'జననాయగన్' కూడా రిలీజ్ సిద్ధమైంది. ఈసినిమా కూడా జూలై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి దూకడానికి రెడీ అయిపోయింది. ఎన్నో వివాదాలు, అడ్డంగులు దాటుకుని ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
దళపతి క్రేజ్ Vs టాలీవుడ్ లవ్ స్టోరీ
ఎన్నో వాయిదాల తర్వాత వస్తున్న 'జననాయగన్' రిలీజ్ డేట్‌ను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అఫీషియల్ పోస్టర్లతో కన్ఫర్మ్ చేసేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న చివరి సినిమా కావడంతో తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఉన్న హైప్ మామూలుగా లేదు. విజయ్ మూవీ ప్రభావం కేవలం తమిళనాడులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ గట్టిగా ఉంది. ఎందుకంటే దళపతికి ఇక్కడ కూడా భారీ మార్కెట్ ఉంది. దీనివల్ల 'చెన్నై లవ్ స్టోరీ'కి థియేటర్ల కేటాయింపులో గట్టి పోటీ తప్పేలా లేదు.
గెలుపు ఎవరిది?
తమిళనాడు మార్కెట్, ఓవర్సీస్ లో 'జననాయగన్' హవా నడిచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తమ ప్యూర్ లవ్ స్టోరీ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే డేట్ మార్చే ప్రసక్తే లేదని గట్టిగా నిలబడ్డారు. 'చెన్నై లవ్ స్టోరీ'లో యూత్‌ను కనెక్ట్ చేసే అదిరిపోయే ఎమోషన్స్, మ్యూజిక్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. ఒకవైపు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామాగా వస్తున్న విజయ్ 'జననాయగన్'.. మరోవైపు గుండెలను హత్తుకునేలా సాగే కిరణ్ అబ్బవరం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు.
ALSO READ : సినిమాల్లేవ్.. అంతా స్పోర్ట్స్ మయం..
ఈ భారీ ఫైట్‌లో దళపతి విజయ్ మాస్ వేవ్‌ను తట్టుకుని, కిరణ్ అబ్బవరం తన 'చెన్నై లవ్ స్టోరీ'తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. జూలై 24న థియేటర్లలో అసలైన పూనకాలు లోడింగ్ ఎలా ఉంటుందో మరి..
