ట్రాన్సిట్ హోమ్‌‌కు డ్రగ్స్ కేసునిందితురాలు.. జైలునుంచివిడుదల..అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు

ట్రాన్సిట్ హోమ్‌‌కు డ్రగ్స్ కేసునిందితురాలు.. జైలునుంచివిడుదల..అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: డ్రగ్స్ కేసులో నిందితురాలైన నైజీరియన్ మహిళ జెమ్స్ బెస్సింగ్ ఎమానియల్ శుక్రవారం చంచల్‌‌గూడ జైలు నుంచి బెయిల్‌‌పై విడుదలైంది. ఆ వెంటనే ఎక్సైజ్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో.. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్​అనుమతితో ఈ చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ అధికారి ఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. ఆ మహిళను జోగిపేటలోని ట్రాన్సిట్ హోమ్‌‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, గత ఏప్రిల్ 2న సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న సమయంలో సికింద్రాబాద్ డీటీఎఫ్ బృందం ఆమెను పట్టుకొని, 7.5 గ్రాముల కొకైన్‌‌ను స్వాధీనం చేసుకుంది.