మలక్ పేట, వెలుగు: నగరంలోని చాదర్‌ఘాట్ మూసీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ గోదాంలలో చెలరేగిన మంటలు బైక్ మెకానిక్ వర్క్‌షాప్‌లు, ఇతర వాణిజ్య సంస్థలకు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది 7 ఫైరింజిన్లతో వచ్చి, మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ఆఫీసర్వెంకన్న తెలిపారు. మలక్ పేట్ ఏసీపీ వెంకట్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు. ఆస్తి నష్టం అంచనా వేసి, ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
